విద్యార్థుల ఆత్మహత్యలపై నేడు ఉన్నత స్థాయి భేటీ
రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థు ల ఆత్మహత్యలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆత్మహత్యల నివారణ సహా ఇత ర అంశాలపై సమగ్రంగా చర్చించనున్న ది.
- కాలేజీలు, విద్యావేత్తలతో చర్చ
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తె లంగాణ) : రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థు ల ఆత్మహత్యలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆత్మహత్యల నివారణ సహా ఇత ర అంశాలపై సమగ్రంగా చర్చించనున్న ది. అందుకు తగ్గట్టు కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నది. ఈ మేరకు సోమవారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో నిర్వహించనున్న ఈ సమావేశానికి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. వీరు కా లేజీల యాజమాన్యాలు, విద్యావేత్తలతో చర్చించనున్నారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ప్రొఫెసర్ నీరదారెడ్డి కమిటీని వేసింది. ఈ కమిటీ నివేదిక సహా ఇతర అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు కార్పొరేట్ కాలేజీల హాస్టళ్లల్లోనే జరుగుతున్నాయి. ఇంటర్ బోర్డు పరిధిలోకి కాలేజీలు వస్తాయి. కానీ హాస్టళ్లు రాకపోవడంతో అధికారులేం చేయలేకపోతున్నారు. ఐఐటీ, నీట్ తదితర టెస్ట్ లు విద్యార్థులను కుంగదీస్తున్నాయి. లెక్చరర్లు దుర్భాషలాడటం, అవమానప ర్చడంతో ఒత్తిడికు గురవుతున్నారు. వీటి దృష్ట్యా కౌన్సెలింగ్ ఇచ్చేందుకు కాలేజీల్లో సైకాలజిస్ట్‌లను నియమించాలని ఇంటర్‌బోర్డు అధికారులు గతంలోనే ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

