Ganesh Puja | హైదరాబాద్, ఆగస్టు 26, (నమస్తే తెలంగాణ): వినాయక చవితి సందర్భంగా గణేశ్ మండపాల వద్ద మితిమీరిన సౌండ్‌తో ఉండే మైక్‌లను ఏర్పాటు చేయవద్దంటూ హైకోర్టు మంగళవారం మార్గదర్శకాలను జారీచేసింది.
తన ఇంటి వద్ద అనుమతి లేకుండా గణేశ్ మండపాన్ని ఏర్పాటు చేశారంటూ సికింద్రాబాద్ ఎంఈఎస్ కాలనీకి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు ప్రభావతి పిటిషన్ దాఖలు చేశారు. ఆమె అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నాకే మండపానికి అనుమతులు ఇవ్వాలని సోమవారం హైకోర్టు ఆదేశించింది. అయితే, హైకోర్టు ఉత్తర్వులను ఉల్లఘించి మండపాన్ని ఏర్పాటు చేశారంటూ ఆమె కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ ఎన్వీ శ్రావణ్‌కుమార్ మంగళవారం విచారించారు. పండుగ ఆహ్లాదకర వాతావరణలో జరగాలని, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా జరుపుకోవాలంటూ మార్గదర్శకాలు జారీచేశారు.
మార్గదర్శకాలు ఇవే