హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ఉద్యోగి తాతాలిక సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకుని పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 1980లో సవరించిన పెన్షన్ నిబంధనల ప్రకారం తాతాలికంగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే పెన్షన్ సర్వీసు ప్రారంభమవుతుందని, పెన్షన్ ప్రయోజనాల లెకింపులో తాతాలిక సర్వీసును కూడా లెకించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల తీర్పు వెలువరించారు. పెన్షన్ లెకింపులో తమ తాతాలిక సర్వీసును పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ డాక్టర్ సీ నిర్మల సహా 52 మంది దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపి, ఈ తీర్పు చెప్పింది. పిటిషనర్ల వినతిని పరిగణనలోకి తీసుకుని పెన్షన్ ప్రతిపాదనలు పంపాలని ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులతోపాటు తామిచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.
విద్యుత్తు కార్మికులకుకోటి ప్రమాద బీమా ; ప్రాణాలు కోల్పోయిన జోగు నరేశ్‌కు చెక్కు అందజేత
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు కార్మికులకు రూ. కోటి ప్రమాద బీమా అందిస్తున్నామని, ఇలా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీజీఎన్పీడీసీఎల్)లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన జోగు నరేశ్ కుటుంబానికి సోమవారం బేగంపేటలోని జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో రూ. కోటి చెక్కుతోపాటు కారుణ్య నియామక ఉత్తర్వులను అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.