హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లా తురపల్లి మండలం గోపాలపురంలో పాఠశాల, బస్టాండ్, వాటర్ ట్యాంకుల నిర్మా ణం కోసం సేకరించిన భూమికి పరిహారం ఇవ్వకపోవడంపై సంబంధిత అధికారుల పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. భూ యజమానికి ఈ నెల 30లోగా పరిహారం చెల్లించాలని ఆర్డీవో, ఎంపీడీవో, తహసీల్దార్లను ఆదేశించింది. పరిహారం చెల్లించని పక్షంలో వ్యక్తిగతంగా హైకోర్టు విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టంచేసింది. అధికారుల వివరణ సంతృప్తికరంగా లేకపోతే జైలుకు పంపాల్సి ఉంటుందని హె చ్చరించింది. మారెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలంటూ 2022 ఆగస్టులో ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడం తో రహీముద్దీన్ దాఖలు చేసిన కోర్టుధికరణ పిటిషన్‌ను జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు. ఆర్డీవో నవంబర్ 13న ప్రకటించిన అవార్డు మొత్తాన్ని ఈనెల 30లో గా చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.