హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా దవాఖానను గోషామహల్ స్టేడియానికి తరలింపుపై ప్రభుత్వ జీవోను సవాల్ చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో కౌంటర్దాఖలు చేయని హెచ్ఎండీఏపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేయకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. గోషామహల్ స్టేడియం స్థలాన్ని ఉస్మానియా దవాఖాన కొత్త భవనాల నిర్మాణం కోసం కేటాయిస్తూ జనవరిలో ప్రభుత్వం జీవో 45 జారీ చేసినంది.
దీనిని సవాలు చేస్తూ రాము దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. కౌంటరు దాఖలుకు రెండు వారాల గడువు కావాలని హెచ్ఎండీఏ న్యాయవాది కోరగా పిటిషనర్ న్యాయవాది అభ్యంతరం వ్యక్తంచేశా రు. హెచ్ఎండీఏకు దసరా సెలవుల్లో తగినంత సమయం లభించినప్పటికీ దాఖలు చేయలేదని అన్నారు. స్టేడియ ం స్థలాన్ని దవాఖానకు కేటాయించడం చట్ట వ్యతిరేకమని, ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు.