హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): జనగామ జిల్లాలోని కాందిశీకుల భూములకు సంబంధించిన సేల్ సర్టిఫికెట్ కోసం ఎవాక్యు ఇంటరెస్ట్ (విభజన) చట్టం-1951 కింద వారసులు పెట్టుకున్న దరఖాస్తును 25 ఏండ్లయినా పరిషరించకపోవడంతో అధీకృత అధికారి మోహన్‌రావుకు రూ.50 వేల జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.
జరిమానాను రెండు వారాల్లో సైనిక సంక్షేమ నిధికి చెల్లించాలని, పిటిషనర్ దరఖాస్తును 4 వారాల్లోగా పరిషరించాలని అధీకృత అధికారిని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. సింగిల్ జడ్జి తీర్పుపై మోహన్‌రావు అప్పీలును కొట్టివేసింది.