హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : ‘మేడిగడ్డ కుంగింది.. కాళేశ్వరం కథ ఒడిసింది.. ప్రాజెక్టు పనికిరాదు.. లక్ష కోట్లు వృథా’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, కొందరు కుహనా మేధావులు మోపిన నిందలన్నీ నీళ్లపాలయ్యాయి. రేవంత్ సర్కార్ రెండున్నరేండ్లుగా చేస్తున్న ప్రచారమంతా వట్టిదేనని తేటతెల్లమైంది. ‘పనికే రాదు..’ అంటూ కూసిన నోర్లే ఇప్పుడు రిపేర్ చేసి నీళ్లిస్తామని ప్రకటించాయి. అవినీతిపై విచారణ అంటూ హడావుడి చేసినా తుదకు కోర్టు తీర్పుతో అదీ ఉత్తదేనని నిరూపితమైంది. మొదటి నుంచీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేదానికి, చేస్తున్నదానికి ఏమాత్రం పొంతనలేదనేది వాస్తవం. ప్రాజెక్టును వాడుకుంటూనే వృథా అని దుష్ప్రచారం చేయడం అందుకు నిదర్శనం. వెరసి ప్రాజెక్టుపై కుట్రలన్నీ పటాపంచలయ్యాయి. సర్కార్ కుట్రపూరిత వైఖరి బట్టబయలైంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ) 7వ బ్లాక్‌లోని 20 పిల్లర్ 2023 అక్టోబర్‌లో కుంగుబాటుకు గురైన విషయం తెలిసిందే. ఆ ఘటనను సాకుగా చూపుతూ మొత్తం ప్రాజెక్టే నిష్ప్రయోజనమనే అసత్య ప్రచారానికి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ పూనుకున్నది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లూ కూలిపోతాయని విషం చిమ్మింది. మొత్తం ప్రాజెక్టే వృథా అంటూ దుష్ప్రచారానికి దిగింది. మంత్రులు, ముఖ్యమంత్రి స్వయంగా బరాజ్‌లను సందర్శించి మరీ అవి నిష్ప్రయోజనం, నిరర్థకమంటూ మాట్లాడారు. కానీ ఆచరణలో మొదటి నుంచీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రాజెక్టును వినియోగించుకుంటూనే ఉన్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులో 14, 15, 16వ ప్యాకేజీల్లో భువనగిరి జిల్లా తురపల్లి మండలం గంధమల్ల, బస్వాపూర్ వద్ద రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉన్నది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచే ఈ రెండు రిజర్వాయర్లకు జలాలు తరలిస్తారు. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం ఇప్పటికే పూర్తికాగా, గంధమల్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. గంధమల్ల వద్ద 9.8 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మించాల్సి ఉన్నది. భూసేకరణకు అడ్డంకులు ఏర్పడటంతో నాడు పనులు ప్రారంభం కా లేదు. అయితే రేవంత్ సర్కార్ వచ్చాక గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీలతో చేపట్టాలని నిర్ణయించింది. రూ. 574.56 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గంధమల్ల రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు. దానికి ఆధారమైన కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం వృథా అంటూ విషం చిమ్మారు.
రేవంత్ సర్కార్ ప్రస్తుతం చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కేసీఆర్ సర్కార్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టే కీలకం. అదే ప్రధాన ఆధారం. గోదావరి జలాలను మూసీలో పోయడమే ప్రాజెక్టు ఉద్దేశం. మల్లన్నసాగర్ నుంచి 20 టీఎంసీలు మూసీ నదికి తరలిస్తారు. మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్ చెరువులను గోదావరి జలాలతో నింపేందకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ సీమ్ ఫేజ్ -1, ఫేజ్-2 పథకానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరుడు సెప్టెంబర్‌లో గండిపేట వద్ద శంకుస్థాపన చేశారు.
తద్వారా మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు వృథా కాదని చాటిచెప్పారు. ఎలాగంటే గోదావరి జలాలు ఏవిధంగా వస్తున్నాయి? అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు, సొరంగాలు, పంప్‌హౌస్‌లు, భారీ కాలువలు, ఇతర నీటి సరఫరా వ్యవస్థను వినియోగించుకోవడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. అంటే ప్రాజె క్టు వృథా కాదని, తాము చేసిన ప్రచారం పూర్తిగా అబద్ధమని కాంగ్రెస్ ప్రభుత్వమే తేల్చిచెప్పింది. ప్రాజెక్టుపై ఉద్దేశపూర్వకంగానే అసత్యప్రచారాలు చేయడం తప్ప మరేమీ లేదని రేవంత్సర్కారే అంగీకరించినట్టయింది.
మేడిగడ్డ బరాజ్‌లో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపాన్ని సాకుగా చూపుతూ మేడిగడ్డనే కాకుండా, మొత్తం ప్రాజెక్టులో నిర్మించిన సుందిళ్ల, అన్నారం బరాజ్‌లు సైతం నిరర్థకమంటూ రేవంత్ సర్కార్ అసత్య ప్రచారం చేసింది. ఆ బరాజ్‌లు కూడా పనికిరావని, ఎప్పుడు కూలిపోతాయో తెలియదని దుష్ప్రచారం చేసింది. కానీ మళ్లీ అదే కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందిళ్ల బరాజ్‌ను వినియోగించుకునేందుకు సిద్ధమైంది. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి కాకుండా గోదావరి జలాలను సుందిళ్ల బరాజ్‌కు తరలించాలని నిర్ణయించింది.
ప్రాణహిత చేవెళ్ల పథకంలో భాగంగా తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మించి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా తరలించవచ్చని, కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మేడిగడ్డకు మళ్లించిందని ఆరోపించింది. తాము తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మించి తరలిస్తామని ప్రగల్భాలు పలికింది. కానీ ఇటీవల తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి మళ్లించడం అసాధ్యమని ఇంజినీర్లు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎల్లంపల్లి కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన, ఇంతకాలం ఎప్పుడు కూలిపోతుందోనని అసత్య ప్రచారం చేసిన సుందిళ్ల బరాజ్నే వినియోగించుకునేలా రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు ఎప్పుడు కూలిపోతాయో తెలియదని, కూలి ప్రాణనష్టం జరిగితే ఎవరు బాధ్యులని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టును బద్నాం చేశారు. నివేదికలు వస్తేనే మరమ్మతులు చేస్తామని, వచ్చాక అధ్యయనం చేస్తున్నామని చెప్తూ జాప్యం చేస్తూ వచ్చారే తప్ప చేసిందేమీ లేదు. కానీ తాజాగా ప్రాజెక్టులో భాగమైన బరాజ్లన్నింటినీ మరమ్మతులు చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే స్వయంగా ప్రకటించారు. మరమ్మతులకు సంబంధించి పరీక్షలను సైతం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. అంటే ఇంతకాలం బరాజ్‌లు పనికిరావని చేసిన ప్రచారమంతా బూటకమేనని, కావాలనే సర్కార్ మరమ్మతులను పక్కనపెట్టిందని తేటతెల్లమైంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారమంతా బూటకమేనని తేలిపోయింది. కమిషన్లు, ఎంక్వయిరీలు వేసినా అవ న్నీ బుట్టదాఖలయ్యాయి. విచారణ నివేదికలు ఏవీ ముందు పడకపోవడమే అందుకు నిదర్శనం. తాజా గా కమిషన్ నివేదికే చెల్లదని హైకోర్టు తీర్పునివ్వడం సర్కార్ ఆరోపణల్లోని డొల్లతనాన్ని బయటపెట్టింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి అంటూ చేస్తున్న ప్రచారమంతా అబద్ధమని ప్రభుత్వమే అసెంబ్లీ వేదికగా అంగీకరించింది. శ్వేతపత్రం విడుదల చేసింది. 2016లో రూ.81,911 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించారు. 2023 వరకు మొత్తంగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు కోసం రూ.93,872 కోట్లు ఖర్చు చేసింది. అందులోనూ పూర్వ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం 2016 వరకు ఖర్చుచేసిన నిధులు రూ.10,146.64 కోట్లు ఉన్నాయి. అంటే ఆ నిధులు మినహాయిస్తే కాళేశ్వరం కోసం నికరంగా ఖర్చుచేసింది రూ.83,725.36 కోట్లు మాత్రమే. మరి ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం పచ్చి అబద్ధమని సర్కారే స్వయంగా అంగీకరించింది. ఇక మేడిగడ్డ బరాజ్ కోసం వెచ్చించిన రూ.3,348 కోట్లు మినహాయిస్తే ఇప్పటికీ 80,377.36 కోట్ల విలువైన ఆస్తులు వినియోగంలోనే ఉన్నాయి. ఆ కాంపోనెంట్లను కాంగ్రెస్ సర్కార్ సైతం వినియోగిస్తున్నది. నీళ్లను ఎత్తిపోస్తున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా సీబీఐ విచారణ కోరారు. ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, అనేక ఏజెన్సీలు, విస్తృతస్థాయిలో విచారణ అవసరమంటూ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుపై మరింత లోతుగా విచారించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, సీబీఐ విచారణకు ఆదేశిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఆ మరుసటి రోజున సీబీఐకి లేఖ రాయడంతోపాటు, నోటిఫికేషన్‌ను సైతం జారీ చేశారు. అయితే ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ ప్రచారం చేసిన ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి అందుకు విరుద్ధంగా సీబీఐకి లేఖ రాయడం గమనార్హం. ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించి రూ.9 వేలకోట్ల అవినీతిపై విచారణ జరపాలని మాత్రమే లేఖ రాశారు. అంటే లక్ష కోట్ల అవినీతి అనేది పచ్చి అబద్ధమని సర్కారే మరోసారి స్వయంగా అంగీకరించింది.

తరతరాల తెలంగాణ రైతుల కరువుకాటకాల తలరాత మార్చేందుకు, చెక్కుచెదరని జలసంకల్ప దీక్షతో పనులను ఉరకలెత్తించి, చరిత్ర ఎరుగని అసాధారణ కాల పరిమితిలో ఆగమేఘాల మీద ఒక ప్రాజెక్టు కడితే; అందులో అవినీతి జరిగిందని నిందలు వేశారు. భారీ జలప్రవాహ వేగంలో ఒక బారేజిలోని రెండు పిల్లర్లు కుంగిపోతే.. ప్రాజెక్టే కూలిపోయిందని గావుకేకలు పెట్టారు. 83వేల కోట్లు ఖర్చయిన ప్రాజెక్టును పట్టుకొని లక్షకోట్ల అవినీతి జరిగిందని కాకిగోల చేశారు. కండ్లముందు కాళేశ్వరం నీళ్లు పారుతుంటే గుండెలు జారి, నిద్రలు కరువై రాజకీయంగా పుట్టగతులుండవనే భయంతో కాంగ్రేస్, బీజేపీతో పాటు తెలిసినోడు, తెలువనోడు.. ఎవడి నోటికి వచ్చిన.. ఎవడి బుర్రకు తోచిన అడ్డగోలు ఆరోపణలన్నీ గుప్పించారు. వాడు, వీడు అని లేదు.. సదువుకున్నోడు అంతే. సదువులేనోడు అంతే. పొడుగోడు అంతే. పొట్టోడు అంతే! మైకులు పగిలేలా నోళ్లకు పని చెప్పారు. ఆఖరుకు కరెంటు పనులు చేసుకునెటోడుకూడా నీటిపారుదల ప్రాజెక్టుల మీద తీర్పులు చెప్పాడు.
వీరావేశాలతో సిగమెత్తి సీన్లు సృష్టించారు. తెలంగాణను ఆకుపచ్చని మాగాణంగా మార్చే ఒక సజీవ అమృతజలధార మీద సముద్రమంత విషం చిమ్మారు. కానీ కాలం ఒక్కలా ఉండదు. కాలగమనంలో అబద్ధాల కోటలు బద్దలు కొట్టుకొని నిజానిజాలు వెలికివస్తాయి. కుట్రలు, కుతంత్రాల ఆయువు చిన్నది. అల్పులకు, అంగుష్టమాత్రులకు ఈ విషయం అర్థం కాదు. కుంగిన పిల్లర్ల ఆధారంగా జలప్రదాత మీద కుట్రపూరిత విచారణలు చేశారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపారు. తర్వాత ఘోష్ కమిషన్ వేశారు. కమిషన్‌కు అడ్డమైన అబద్ధాలు చెప్పించారు. తమకు కావలసిన రీతిలో నివేదిక వచ్చేలా సెలెక్టివ్ సమాచారం అందించారు. అన్నీ చేసి ఏం బావుకున్నారు? 17 నెలల విచారణ, 115మంది సాక్ష్యాలు, బోలెడంత ప్రజల డబ్బు తగలేశారు. ఎక్కడా ఏం దొరక్క తంటాలు పడుతుంటే దింపుడు కల్లం ఆశతో కమిషన్ కాలపరిమితి అనేకసార్లు పెంచారు.
ఇంతా జరిగిన తర్వాత ఇచ్చిన 650 పేజీల నివేదిక పెట్టుకొని ఆఖరుకు సాధించిందేమిటి? కోర్టు దాన్ని చెత్తబుట్టలో పడేసింది. గోదావరి నీరు మళ్లింపుతో తెలంగాణ రైతు నాలుగు డబ్బులు కండ్లచూస్తే ఓర్చుకోలేని పచ్చ మీడియా విచారణ సాగుతున్నంత కాలం లీకుల పేరుతో ప్రజల బుర్రలను విషపూరితం చేసింది. అపర భగీరథుడిని మలినపరిచే ఘాతుకానికి దిగి.. ఇక జైలే అని ఒకటి.. లేదు అరెస్టే అని మరొకటి తీర్పులు ఇచ్చింది. తాజా తీర్పుతో దిమ్మతిరిగి, కొంపలో ఎవరో పోయినట్టు సంతాపదినాలు ప్రకటించి మౌనంగా రోదిస్తున్నది. ఇవాళ కాళేశ్వరం కడిగిన ముత్యంలా ప్రకాశిస్తున్నది. లక్ష కోట్లు వృథా. కాళేశ్వరం పనికిరాదు అంటూ గొంతులు పగిలేలా ప్రచారాలు చేసిన నాయకులు, పునరుద్ధరణ చేయమంటే ‘కూలిపోతే ఎలా? ప్రాణాలు పోతే ఎలా?’ అన్న మంత్రులే.. ఎల్‌నినో భయం వెంటాడుతుంటే చెమటలు కక్కుతూ మేడిగడ్డ సందర్శన పెట్టుకున్నారు. చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా కాళేశ్వరాలయ దర్శనం చేసుకొని లెంపలేసుకున్నారు.
‘ప్రాజెక్టే పనికిరాదు’ అన్న నోళ్లే ఇపుడు పునరుద్ధరణ మాటలు మాట్లాడడంతో ఆ ఆరోపణలు బూటకమని తేలిపోయింది. ఇక తాజాగా హైకోర్టు తీర్పుతో లక్షకోట్ల అవినీతి అన్న ఆరోపణలు గాల్లో కలిసిపోయాయి. దీనికితోడు ‘ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు. మూడు బ్యారేజీలు పనికిరావు’ అన్న నోళ్లే ఇపుడు తమ్మిడిహట్టి నీళ్లు సుందిళ్ల బ్యారేజ్‌లో పోస్తామంటూ చెప్పడంతో కాంగ్రెస్ నేతలు, వారి తోడు దొంగలు బీజేపీ నాయకులు చేసిన ప్రచారమంతా బూటకమని, దురుద్దేశపూర్వకమని తేలిపోయింది. ఇటీవల గంధమల్ల ప్రాజెక్టుకు శ్రీకారం.. మొన్న మేడిగడ్డ బారేజ్ పునరుద్దరణ ప్రకటన.. నిన్న కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద హైకోర్టు తీర్పు.. దానికితోడు మూసీకి అవే నీళ్లు… సుందిల్ల బ్యారేజ్‌ను వినియోగించుకుంటామనే ప్రకటన.. అన్నీ కాళేశ్వరం అవసరం, ప్రాధాన్యత, ప్రాముఖ్యతకు తార్కాణాలే! ఇవాళ కాళేశ్వరం అన్ని ఆరోపణలనుంచి.. అపవాదులనుంచి.. విముక్తమై సమున్నతంగా సగర్వంగా నిలబడింది.
ఎవరు పగబట్టి ఎన్ని ఆరోపణలు చేసినా ఎందరు కక్షగట్టి ఎంత బురద చల్లినా.. లాభనష్టాల పిచ్చి పంతుళ్లు ఎంత తలతిక్క వాదనలు లేవనెత్తినా, పిల్లికూతలు కూసినా అన్నీ తాత్కాలిక అవరోధాలుగా మాత్రమే చరిత్రలో మిగిలిపోయాయి. కాలగమనంలో అవన్నీ కొట్టుకుపోయాయి. కాళేశ్వరం ఇపుడు కడిగిన ముత్యం. తెలంగాణ తల్లి మెడలో దగద్ధగాయమానంగా వెలుగులీనే జలరత్నహారం. హైకోర్టు తీర్పునకు ఒక రోజు ముందు రేవంత్ కాళేశ్వరుడిని దర్శించుకుని ఏం వేడుకున్నారో తెలియదుగానీ.. ఆ కాళేశ్వరుడు తన జటాఝూటాన్ని సవరించి హైకోర్టు తీర్పు రూపంలో గంగమ్మకు విముక్తి కలిగించాడు. తెలంగాణ రైతును ఆశీర్వదించాడు.
83వేల కోట్లు ఖర్చయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు వృథా అయ్యాయని జాతీయ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అంటాడు. దేశాన్ని ఏలే బీజేపీ కేంద్రమంత్రి ఒకరు ఏకంగా పార్లమెంటులో లక్షకోట్లు కొట్టుకుపోయాయని ప్రకటిస్తారు. అంటే పార్టీలు వేరుగానీ. కుట్రల్లో అంతా తోడుదొంగలే.. అనేది దీని సారాంశం.
మేడిగడ్డ బరాజ్ కూ లిందని ప్రచారం చేసిన కాంగ్రెస్ సర్కార్ దానిపైనుంచి సీఎం కాన్వా య్ ఎలా వెళ్లింది? కా ళేశ్వరం కూలిందని, లక్ష కోట్లు తిన్నారంటూ రేవంత్‌రెడ్డి నిత్యం విషప్రచారం చేసి తెలంగాణ ప్రజల్లో విషం నింపారు. కుంగిన పిల్లర్లకు మరమ్మతు చేస్తామని ఎల్అండ్టీ సంస్థ చెప్పినా సర్కార్ వినలేదు. రెండున్నరేండ్లు మేడిగడ్డను పడావుపెట్టి, అక్కడి నుంచి ఇసుకను తీసి విక్రయించారు. ఇప్పటికైనా సర్కార్ మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేయించాలి.
-పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే
కేసీఆర్ ప్రభుత్వం ని ర్మించిన కాళేశ్వరం ప్రా జెక్టు ప్రపంచంలోనే గు ర్తింపు పొందింది. సీఎం రేవంత్‌రెడ్డి హైకోర్టు తీర్పుతోనైనా బుద్ధితెచ్చుకోవా లి. ఎస్ఎల్బీసీ ప్రా జె క్టు పనుల్లో ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు చనిపోయారు. ఇందుకు సీఎం రే వంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌పై కేసు నమోదు చేయాలి.
-అనిల్ జాదవ్, బోథ్ ఎమ్మెల్యే
హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్‌కు బుద్ధిరావా లి. కాళేశ్వరం బాగుపడితే కేసీఆర్‌కు పేరు వ స్తుందని రేవంత్‌రెడ్డి కుట్రకు తెరలేపారు. కా ళేశ్వరం కూలిపోయింద ని, రూ.లక్ష కోట్లు నీళ్ల పాలయ్యాయని నోటికొచ్చినట్టు మాట్లాడిన కాంగ్రెస్ నా యకులకు మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టే దిక్కయ్యింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాళేశ్వరంపై సీఎం రేవంత్‌రెడ్డి విషం కక్కుతూనే ఉన్నారు.
-డాక్టర్ సంజయ్ , కోరుట్ల ఎమ్మెల్యే
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణాకు ప్రా ణా ధారం. ఈ ప్రాజెక్టు ద్వా రా సాగునీటిని అందించడంతో లక్షలాది ఎకరా ల్లో రైతులు పంటలు పండిస్తున్నా రు. ఇంత గొప్ప ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డి సర్కా ర్ కు ట్రలు చేసింది. కేసీఆర్‌కు మంచి పేరు వ స్తుందనే ప్రాజెక్టును పండపెట్టారు. హై కోర్టు తీర్పు ముమ్మాటికి తెలంగాణ ప్రజల విజయం. మేడిగడ్డ పిల్లర్లకు వెంటనే మరమ్మతులు చేసి సాగునీరందించాలి.
-కే మాణిక్‌రావు, జహీరాబాద్ ఎమ్మెల్యే
అది పీసీ ఘోష్ కమిషన్ కా దు.. పీసీసీ కమిషన్లా ఉన్నది. కాళేశ్వరంలో పిల్లర్లు కుంగిపోలేదు. పేల్చారనే అనుమానం కలుగుతున్నది. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలన్నీ హైకోర్టు తీర్పుతో పటాపంచలయ్యాయి. కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం కూడా సంతృప్తికరంగా లేదు. కేసీఆర్, హరీశ్‌రావును బద్నాం చేయాలని భావించిన కాంగ్రెస్ సర్కార్ బోల్తా పడింది.
– వీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి
కాళేశ్వరంపై ఇన్ని రోజులు విచా రణ పేరుతో అనవసరంగా ప్రజా ధనం వృథా చేశారు. రెండు పిల్లర్లు కుంగితే ఎల్అండ్టీ సంస్థ మ రమ్మతులు చేస్తామని చెప్పినా కాంగ్రెస్ సర్కార్ రాజకీయం చేసిం ది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత మామ లక్ష కోట్ల అవినీతి జరుగలేదని చెప్పి నా సర్కార్ మాత్రం కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసింది. రేవంత్ సర్కార్ రైతులకు సాగునీరు అం దించడంలో విఫలమైంది. తప్పుడు కేసులు పెట్టి బీఆర్ఎస్ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేస్తున్నది.
-లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి
కాళేశ్వరంపై చివరికి న్యాయమే గెలిచింది. సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రెండున్నరేండ్లపాటు జపం చే శారు. కేసీఆర్‌పై, కాళేశ్వరంపై ఆరోపణలు చేసే సమయంలో కనీసం పిల్లనిచ్చిన మామతోనైనా మాట్లా డి తెలుసుకోవాలి. కాళేశ్వరం ద్వారా లబ్ధిపొందిన ప్రజలు ఇప్పటికీ కేసీఆర్‌కు అండగా ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కమిషన్లు వేసినా బీఆర్ఎస్ నాయకత్వం వెనుకడుగు వేయదు.
-సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి
ఘోష్ కమిషన్ నివేదిక చెల్లద ని హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. ఈ తీర్పుతో రేవంత్‌రెడ్డి కపటబుద్ధి బయటపడింది. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే రేవంత్‌రెడ్డి ఘోష్ కమిషన్ వేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రెండున్నరేండ్లుగా రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు.
– జోగు రామన్న, మాజీ మంత్రి
ఘోష్ కమిషన్ నివేదికను నిలిపి వేసూ హైకోర్టు తీర్పు ద్వారా న్యా యం వెలుగులోకి వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి. మేడిగడ్డ బరాజ్‌లో స్వల్పంగా దెబ్బతిన్న పిల్లర్ల మర మ్మతులు తక్షణమే పూర్తి చేసి సా గునీరు అందించాలి. కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రైతులను ఇబ్బం దులు పెట్టొద్దు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి. పీసీ ఘోష్ కమిషన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాన్ని దెబ్బతీయాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన రాజకీయ కుట్ర హైకోర్టు తీర్పు ద్వారా బయటపడింది.
-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పేరుతో చేసిన రాజకీయ కక్ష సాధింపులకు హై కోర్టు తీర్పు చెంపపెట్టు. సహజ న్యాయ సూత్రాలు, ప్రాథమిక హక్కులను కమిషన్ తుంగలో తొ క్కింది. రెండున్నరేండ్లుగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు, మీడియా హంగామా, రాజకీయ డ్రామాలన్నీ హైకోర్టు ముందు బట్టబయలయ్యాయి.
-మన్నె గోవర్ధన్‌రెడ్డి