హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ పోలీసు అధికారి రాధాకిషన్‌రావుపై నమోదై న ఫోన్‌ట్యాపింగ్ కేసు దర్యాప్తును నిలిపివేస్తూ వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసు లో ఇతర నిందితులను కస్టడీకి కోరిన నేపథ్యం లో దర్యాప్తును కొనసాగించడానికి అనుమతించాలంటూ పోలీసులు దాఖలుచేసిన మ ధ్యంతర పిటిషన్‌పై విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తూ జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
పోలీసుల మధ్యంతర పిటిషన్, కేసును కొట్టివేయాలని, బెయిలు మంజూరు చేయాలని కోరుతూ హరీశ్‌రావు, రాధాకిషన్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై సమగ్ర విచారణ చేస్తామని చెప్పారు. పోలీసు ల తరఫున పీపీ నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ ఈకేసులో 3,4,5వ నిందితులకు కింది కోర్టు బెయిలు మంజూరు చేసిందన్నారు.
కేసు దర్యాప్తునకు అనుమతించాలని కోరారు. బెయిలు మంజూరయ్యాక మధ్యంతర పిటిషన్‌పై విచారణ అవసరం ఏమున్నదని జడ్జి ప్రశ్నించారు. ఈ నెల 27న విచారిస్తామని, వాయిదాలు కోరవద్దని స్పష్టంచేశారు.