వీఆర్ఏల సర్దుబాటుపై హైకోర్టు స్టే
విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లను రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా సర్దుబాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం జారీచేసిన జీవో 81 అమలుపై హైకోర్టు స్టే విధించింది.
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లను రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా సర్దుబాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం జారీచేసిన జీవో 81 అమలుపై హైకోర్టు స్టే విధించింది. ఈ జీవో విడుదలైన జూలై 24 నాటికి ఉన్న పరిస్థితులను యథాతథంగా కొనసాగించాలని ఆదేశించింది. వీఆర్ఏలను జూనియర్ అసిస్టెంట్లుగా నియమించే ముందు తమకు పదోన్నతి కల్పించాలని కోరుతూ రెవెన్యూశాఖలోని ఆఫీస్ సబార్డినేట్స్ దాఖలు చేసిన వ్యాజ్యంపై గురువారం జస్టిస్ పీ మాధవీదేవి విచారణ చేపట్టారు. ప్రతివాదుల జాబితా నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్, సీసీఎల్ నవీన్‌మిట్టల్, కేంద్ర ఎన్నికల సంఘాలను తొలగించాలని పిటిషనర్‌ను ఆదేశించారు. ఇతర ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, ఆర్థికశాఖల ముఖ్య కార్యదర్శులు కౌంటర్ దాఖలు చేయాలని సూచించారు. విచారణను 3 వారాలకు వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- adjustment
- High court
- VRAs
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

