హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కమలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులోని సెక్షన్-188 అభియోగాన్ని హైకోర్టు రద్దు చేసింది. అయితే, ప్రధాన కేసు విచారణను ఎదుర్కోవాలని స్పష్టంచేసింది. కమలాపూర్ ఎంపీడీవో ఫిర్యాదుతో నమోదైన కేసును కొట్టివేయాలంటూ పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. దీనిని కౌశిక్‌రెడ్డి కోర్టులో సవాల్ చేశారు. వాదనల తర్వాత హైకోర్టు, సెక్షన్-188 చెల్లదని తేల్చింది.