phone tapping case | హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసు వార్తలను ప్రచురించే, ప్రసారం చేసే ముందు పత్రికలు, టీవీ లు సంయమనం పాటించాలని హైకోర్టు సూ చించింది. గత వారం పత్రికల్లో న్యాయమూర్తుల, వారి కుటుంబసభ్యుల పేర్లు ఫోన్ నంబర్లను పత్రికలో ప్రచురించినట్టు (నమస్తే తెలంగాణ కాదు) గుర్తించామని, ఇలాంటి సున్నిత విషయాల్లో మీడియా సంయమనం పాటించాలని హితవు చెప్పింది.
ఎస్ఐబీ అదనపు ఎస్పీ (సస్పెన్షన్‌లో ఉన్నారు) భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రాజకీయ ప్రత్యర్థులు ప్రైవేటు వ్యక్తులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్టు పత్రికల్లో వార్త లు వచ్చాయి. ఆ కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. కౌంటరు దాఖలు చేశామని రా ష్ట్రం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ చెప్పారు. కేంద్రం గడువు కోరగా ఈ సమయంలోనే వార్తల విషయంలో అప్రమత్తత పాటించాలని హైకోర్టు సూచిస్తూ విచారణను 23కు తేదీకి వాయిదా వేసింది.
ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు: ప్రభాకర్‌రావు
నాంపల్లి కోర్టులు: ఇప్పట్లో భారత్ తిరిగి వచ్చే అవకాశం లేదని, విచారణ అధికారికి పూర్తిగా సహకరిస్తానని ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూ రో మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు వెల్లడించారు. ఈ మేరకు విచారణ అధికారి, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి ఓ లేఖ రాశారు. క్యాన్సర్‌తోపాటు కొత్తగా గుండె, మూత్రకోశ సంబంధిత వ్యాధుల వల్ల బాధపడుతున్నానని, చికిత్స నిమిత్తం అమెరికాలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రయాణం ప్రమాదమని వైద్యులు సలహా ఇచ్చారన్నారు.
మూడోసారి చార్జిషీట్ వెనక్కి.. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరస్కరించిన కోర్టు
నాంపల్లి కోర్టులు : ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడోసారి పోలీసులు దాఖలుచేసిన చార్జిషీట్‌ను కోర్టు వెనక్కి పంపింది. చార్జిషీట్లో పేర్కొన్న సాక్ష్యాధారాలను, కీలక పత్రాలను పూర్తిస్థాయిలో సమర్పించలేదని పేర్కొంది. పంజాగుట్ట ఏసీపీ వెం కటగిరి ఆధ్వర్యంలో అదనపు కీలక పత్రాలను కోర్టుకు సమర్పించారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం 65-బీ కింద కోర్టుకు జమ చేయాల్సిన పెన్‌డ్రైవ్‌లు, సీడీలను సమర్పించకపోవడంతో ఇటీవల కోర్టు అనుమతి కోరారు. ఆ తర్వాత ఆ యా వస్తువుల్ని సమర్పించినట్టు పోలీసు అధికారులు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాంబశివారెడ్డి ద్వారా కోర్టుకు తెలిపారు.
అయినా అభియోగపత్రాల్లో సూచించిన విధంగా అన్ని వస్తువులు సమర్పించలేద ని కోర్టు తెలిపింది. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి చార్జిషీట్‌ను తిప్పి పంపించిం ది. మూసీ నదిలో లభించిన కీలక అధారాలను కోర్టుకు సమర్పించలేదని, చార్జిషీట్ లో పేర్కొన్న విధంగా ఆధారాలను, కీలక పత్రాలను సరిచూసుకోవాలని ఆదేశించింది. ఎస్ఐబీ టాస్క్‌ఫోర్స్ మాజీ అధికారి ప్రభాకర్‌రావును, ఓ మీడియా సంస్థ ప్రతినిధి శ్రావణ్‌కుమార్‌ను ఇప్పటివరకు అదుపులోకి తీసుకోకపోవడం గమనార్హం.