హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ప్రపంచ వారసత్వ నిర్మాణంగా గుర్తింపు పొందిన కుతుబ్‌షాహీ టూంబ్స్ పరిరక్షణకు చేపడుతున్న చర్యలేమిటో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు అగాఖాన్ ట్రస్టును ఆదేశించింది.
టూంబ్స్ పరిరక్షణకు100 కోట్లు వెచ్చించేందుకు అగాఖాన్ ట్రస్టు ముందుకొచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని కాంగ్రెస్ నేత మధుయాష్కీగౌడ్ రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి, సోమవారం విచారణ చేపట్టింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసి, తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): చెన్నమనేని రాజేశ్వర్‌రావు శతజయంతి సందర్భంగా చెన్నమనేని రాజేశ్వర్‌రావు, లలితాదేవి ఫౌండేషన్ ‘శాసనసభలో మూడు దశాబ్దాల ప్రజావాణి-చెన్నమనేని’ పుస్తకాన్ని విడుదల చేసింది. ఆ పుస్తకానికి సంబంధించిన 150 కాపీలను రాజేశ్వర్‌రావు కుటుంబసభ్యులు సోమవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు అందజేశారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గడ్డం వివేక్ పాల్గొన్నారు.