హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): చేపపిల్లలు పంపిణీ చేసినవారికి నగదు చెల్లింపులు చేయాలని గత డిసెంబర్లో జారీచేసిన ఉత్తర్వులను అమలు చేసే తీరిక ఐఏఎస్ అధికారులకు లేదా? అని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులపై ఎందుకు స్పందించరని నిలదీసింది.
ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడం, కోర్టు ధికరణ పిటిషన్పై విచారణ సమయంలో చిట్టచివరి అవకాశం కల్పించినప్పటికీ కదలిక లేకపోవడం, కనీసం ఐఏఎస్ అధికారులు తమ వాదనలతో కౌం టర్ పిటిషన్ కూడా దాఖలు చేయకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 30న జరిగే విచారణకు స్వయంగా వివరణ ఇవ్వండి’ అని వారిని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి ఘోష్, తదితరులకు నోటీసులు జారీ చేసింది.