హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడి నియామకంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను గమనించలేదా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తికి పరీక్ష అవసరంలేదని స్పష్టత ఇచ్చినా నియామకంలో జాప్యం ఎందుకు జరుగుతున్నదని నిలదీసింది. రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడి పోస్టును భర్తీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది బగ్లేకర్ ఆకాశ్‌కుమార్ వేసిన పి ల్‌పై ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పుపై వివరణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. ఆ ఉత్తర్వులను పరిశీలించి వివరణ ఇస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.