హైదరాబాద్,అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : స్టాఫ్‌నర్సుల నియామకానికి సంబంధించిన కేసులో హైకోర్టు తుది ఉత్తర్వులను జారీచేసింది. పిటిషనర్లకు వెయిటేజీ మారులను కలిపి మొత్తం మారులను వెల్లడించాలని, ఆ మేరకు వారు అర్హత సాధిస్తే ఖాళీ పోస్టుల్లో భర్తీ చేయాలని సూచించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య సర్వీసెస్ నియామక బోర్డుకు ఉత్తర్వులు జారీచేసింది. ఓఎంఆర్ విధానం నుంచి కంప్యూటర్ ఆధారంగా పరీక్షలు నిర్వహించడాన్ని సవాలు చేస్తూ బీ నిర్మల సహా 11 మంది దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన అనంతరం జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఇటీవల ఆదేశాలు జారీచేశారు. రాత పరీక్షకు 80, సర్వీసుకు 20 పాయింట్ల చొ ప్పున నార్మలైజేషన్ పద్ధతిన మారులు కేటాయించారని పిటిషనర్ న్యాయవాది చెప్పారు.
ఓఎంఆర్ నుంచి కంప్యూటర్ విధానం నార్మలైజేషన్ ద్వారా మారుల కేటాయింపు అంశం గురించి ఉద్యోగ నోటిఫికేషన్లో లేదని తెలిపారు. 38 వేల మందికి మూడు ఫిష్ట్ల్లో పరీక్షలను ఏ ప్రాతిపదికపై నిర్వహించిందీ చెప్పలేదని అన్నారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ప్రతివాదన చేస్తూ, నార్మలైజేషన్ గురించి మారుల జాబితాను ప్రకటించడానికి ముందే తెలియజేశామని అన్నారు. వాదనల అనంతరం హైకోర్టు.. వెయిటేజీ మారుల తరువాత పిటిషనర్లు అర్హత సాధించారో లేదో కౌంటర్లో వివరించకపోవడాన్ని తప్పుపట్టింది. పిటిషన్లపై విచారణ ముగిస్తున్నట్టు ప్రకటించింది.