హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూముల్లో జరిగిన అక్రమ లావాదేవీలపై ప్రభుత్వం విచారణ కమిషన్ వేస్తుందో లేదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు నోటీసులు జారీచేసింది.
మహేశ్వరం మండలం, నాగారం లోని సర్వే నం 194, 195లో తండ్రి ద్వారా సంక్రమించిన 10.17 ఎకరాలను అధికారులు ప్రైవేటు వ్యక్తుల పేరిట మార్చేశారని ఆరోపిస్తూ అదే గ్రామానికి చెందిన వీ రాములు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ జరిపారు. తదుపరి విచారణను 28కి వాయిదా వేశారు.