High Court | సికింద్రాబాద్లో శాంతి ర్యాలీకి అనుమతించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు
High Court | సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టనున్న శాంతి ర్యాలీకి అనుమతించాలని హైకోర్టు పోలీసు శాఖను సోమవారం ఆదేశించింది.
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టనున్న శాంతి ర్యాలీకి ( Peace Rally ) అనుమతించాలని హైకోర్టు( High Court ) సోమవారం పోలీసు శాఖను ( Police Department ) ఆదేశించింది. సోమవారం ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు గత నెల 21 వ తేదీన చేసిన దరఖాస్తు పట్ల సానుకూలంగా స్పందించాలని సూచించింది.
అవసరమైతే లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులతో సంప్రదించి తగు నిబంధనలు రూపొందించి పూర్తి నివేదికను ఈ నెల 5 వ తేదీ లోగా సమర్పించాలని హై కోర్టు 13 వ బెంచ్ న్యాయమూర్తి తుకారాం జీ పోలీసు శాఖను ఆదేశించారు. లష్కర్ జిల్లా సాధన సమితి తరపున సీనియర్ న్యాయవాది ముఖీద్ వాదనలు వినిపించారు.
గత నెల 17 న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్ లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ కోసం పోలీసు శాఖను అనుమతి కోరగా, చివరి నిమిషంలో పోలీసు అధికారులు నిరాకరించారు. దీంతో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ జనవరి 21న నగర పోలీసు కమిషనర్, మల్కాజిగిరి డీసీపీలకు శాంతి ర్యాలీకి అనుమతించాలని కోరుతూ మరోమారు దరఖాస్తు చేశారు.
ఈ దరఖాస్తు పై పోలీసు శాఖ నుండి స్పందన లేకపోవడంతో ఫిబ్రవరి 7 వ తేదీన ర్యాలీకి అనుమతించాలని కోరుతూ లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు హై కోర్టును ఆశ్రయించగా సోమవారం హైకోర్టు సానుకూలంగా స్పందించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

