హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి) పెట్టుకున్న దరఖాస్తుపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. తమ దరఖాస్తుపై పోలీసులు స్పందించడం లేదంటూ ‘ఫతి’ శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ఈ ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి)ఆధ్వర్యంలో శనివారం నిర్వహించతలపెట్టిన ఉన్నత విద్యాసంస్థల అధ్యాపకుల సాంత్వన మహాసభ ఈ నెల 14వ తేదీకి వాయిదా పడింది. హైకోర్టు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ‘ఫతి’ కార్యానిర్వాహక కమిటీ శుక్రవా రం ప్రకటించింది. విద్యార్థుల మహార్యాలీని ఆ తర్వాతే నిర్వహిస్తామని తెలిపింది.