హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. 19వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన ఆకుల యాదగిరిని బుధవారం ఉదయం 10:30 గంటలకు తమ ఎదు ట హాజరుపర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. యాదగిరి కనిపించడం లేదని ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదంటూ ఆయన కుమారుడు హరికాంత్ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిన్ గాడి ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాస నం మంగళవారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా మంగళవారం ఉద యం 11గంటలకు చైర్మన్ ఎన్నిక ఉం దని చెప్పడంతో ఆ ఎన్నికలను నిలిపి స్తూ మధ్యంతర ఉత్తర్వులను వెలువరించింది. ఈ ఆదేశాల జారీ తర్వాత యాదగిరి కనిపించారని, ఎన్నికల్లో కూ డా పొల్గొన్నారని న్యాయవాదులు మ ధ్యాహ్నం ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఆ ఎన్నికను హై కోర్టు అనుమతించలేదు. యాదగిరితోపాటు ఆయన భార్యను కూడా హాజరుపరచాలని ఆదేశించింది. వీళ్లను ధ్రువీకరించేలా అమికస్‌క్యూరీగా న్యాయవా ది ఏ రామకృష్ణారెడ్డిని నియమించింది.
చైర్మన్ రేసులో యాదగిరి
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎం కిషన్‌రెడ్డి, ఆయన కొడుకు ప్రశాంతరెడ్డి కిడ్నాప్ చేశారనే వాదనలను న్యాయవా ది టీవీ రమణారావు తీవ్రంగా వ్యతిరేకించారు. యాదగిరిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు. యాదగిరే స్వయ ంగా కనిపించకుండా వెళ్లిపోయారని, మంగళవారం జరిగిన మున్సిపల్ చైర్మ న్ ఎన్నికలప్పుడు ప్రత్యక్షం అయ్యారని వివరించారు. చైర్మన్ ఎన్నిక కూడా జరిగిపోయిందని తెలిపారు. అందువల్ల త దుపరి ఉత్తర్వుల అవసరం ఉండదని అన్నారు. దీనిపై హైకోర్టు.. వాస్తవాల ను నిర్ధారించుకునే నిమిత్తం అమికస్ క్యూరీని నియమిస్తున్నట్టు ప్రకటించిం ది. యాదగిరి, ఆయన భార్యను బుధవారం తమ ఎదుట హాజరపర్చాలని పోలీసులను ఆదేశించింది. అప్పటివరకు ఎన్నికలపై మ ధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టంచేసింది.