హైదరాబాద్, డిసెంబర్ 2 (నమ స్తే తెలంగాణ): వీధికుకల నియంత్రణకు సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీకి స్పష్టం చేసింది. వీధికుకలను పట్టుకున్న తర్వాత వాటికి స్టెరిలైజేషన్ చేసి, టీకాలు వేయాలని, అనంతరం వాటిని ఆశ్రయ కేంద్రాలకు తరలించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. వీధికుకల నియంత్రణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలన్న వినతి పత్రాలను పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ అసోసియేషన్ ఫర్ యానిమల్ షెల్టర్అండ్ రెస్యూ ఎయిడ్ (ఆస్రా) సంస్థ పిటిషన్ దాఖ లు చేయడంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నెల 9న జరిగే తదుపరి విచారణకు చీఫ్ వెటర్నరీ అధికారి వ్యక్తిగతంగా లేదాలేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు.