హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ) : ఫోన్‌ట్యాపింగ్‌పై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇతరులపై పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసులో సాక్షిని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలోనే విచారణకు పిలవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణ సమయంలో సాక్షితోపాటు న్యాయవాదిని అనుమతించేందుకు నిరాకరించింది. పోలీసులు ఎప్పుడుపడితే అప్పుడు విచారణకు పిలుస్తున్నారంటూ ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ఉద్యోగి వంశీకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు. న్యాయవాది ఆర్ చంద్రశేఖర్‌రెడ్డి వాదిస్తూ, ముందస్తు సమాచారం లేకుండా సాక్షిని పోలీసులు పిలుస్తున్నారని, తీసుకెళ్లిన తర్వాత రాత్రి వరకు ఉంచుకుని వదులుతున్నారని చెప్పారు. ముందస్తు నోటీసు కూడా ఇవ్వడం లేదని అన్నారు.