హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): దవాఖానలోని వ్యర్థాలను నివాస ప్రాంతంలో గొయ్యి తీసి కప్పెట్టేస్తున్నారనే కేసులో హైదరాబాద్ ప్రేమ్‌నగర్‌లోని విరించి దవాఖాన యాజమాన్యానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి, జీహెచ్ఎంసీ, కాలుష్య నియంత్రణ మండళ్లకు కూడా నోటీసులు పంపింది. తన ఇంటి పకనే గుంతలు తవ్వి దవాఖాన వ్యర్థాలను పాతిపెడుతున్నారంటూ ఖైరతాబాద్‌కు చెందిన రిజ్వాన్‌ఖాన్ వేసిన పిటిషన్‌ను బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా ఉత్తర్వులు జారీ చేయబోమని స్పష్టం చేసిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.