హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన మెనూ తెలియజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారా? ఒకో విద్యార్థికి ఎంత కేటాయిస్తున్నారు? ఆ మొత్తాన్ని పెంచారా? లేదా? అనే వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీచేసిన ధర్మాసనం.. విచారణను 3 వారాలపాటు వాయిదా వేసింది.