Danam Nagender | కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ చిహ్నంపై ఖైరతాబాద్ నుంచి శాసనసభకు ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది.
- స్పీకర్ కార్యాలయం, న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘానికీ జారీ
- అనర్హత వేటు వేయాలంటూ దాఖలు చేసిన బీఆర్ఎస్ పిటిషన్‌పై వాదనలు
- ప్రతివాదులకు నోటీసులిచ్చిన హైకోర్టు
- సభాపతికి విడిగా నోటీసులిచ్చేందుకు నో
Danam Nagender | హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ చిహ్నంపై ఖైరతాబాద్ నుంచి శాసనసభకు ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా అనర్హత వేటు వేయలేదని పిటిషనర్ పేర్కొనడంతో హైకోర్టు ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న నాగేందర్, న్యాయశాఖ కార్యదర్శి, స్పీకర్ కార్యాలయం, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది. స్పీకర్‌కు మాత్రం నోటీసు ఇచ్చేందుకు నిరాకరించింది. నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని గత మార్చి 14న ఇచ్చిన ఫిర్యాదుపై స్పీకర్ చర్య తీసుకోలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి సోమవా రం విచారణ చేపట్టారు.
ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని, విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. తొలుత పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. దానం నాగేందర్‌పై వేటు వేసేలా స్పీకర్‌కు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. స్పీ కర్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని చెప్పారు. కనీసం తమ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని దానం కు నోటీసులు కూడా జారీ చేయలేదని అన్నారు. ఫిర్యాదు చేయడం కోసం స్పీకర్‌ను కలిసేందుకు ఎమ్మెల్యేలకు అనుమతి కూడా ఇవ్వలేదని తెలిపారు. మరో దారిలేకపోవడంతో రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని తెలిపారు.
దానం బీఆర్ఎస్ బీఫాంపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారని, ఆ పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరారని వివరించారు. ఇది పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వేటు వేయాల్సిన విషయమని అ న్నారు. ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్‌కు నిర్దిష్ట గడువు ఉన్నదని, ఈ మేరకు ఇతర కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని గుర్తుచేశారు. దీనిపై అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి ప్రతివాదన చేస్తూ, స్పీ కర్ కార్యాలయానికి నోటీసులు ఇస్తున్నప్పుడు స్పీకర్‌కు నోటీసులు అవసరం లేదని చెప్పారు. అనర్హత వేటు వే యాలని స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చే అవకాశం లేదని అన్నారు. 2019లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వాళ్లపై ఫిర్యా దు చేస్తే 2023 వరకు పరిషరించలేదని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

