బాసర, అక్టోబర్ 24 : ఫీజు బకాయి ఉన్నదంటూ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యంపై పూర్వ విద్యార్థి సామల ఫణికుమార్ హైకోర్టు మెట్లెక్కగా.. ఈ కేసు గురువారం విచారణకు వచ్చింది.
తనలాగే వేలాది మంది విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తున్నదని, ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చిన వాళ్లంతా ఉచిత విద్యను అభ్యసించడానికి హక్కు ఉన్నదని, దానికి సంబంధించిన పూర్తి ఫీజు ప్రభుత్వమే భరించాలని పిటిషనర్ తరఫున హైకోర్టు అడ్వొకేట్ చందన వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు నుంచి ట్రిపుల్ ఐటీకి నోటీసులు జారీ అయ్యాయి. హైకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీ గోవర్ధన్ తెలిపారు.