హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముం దస్తు బెయిల్ కోసం మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై 2 వారాల్లోగా కౌంటర్ వేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. దీనితోపాటు హరీశ్‌రా వు పిటిషన్‌నూ 24న విచారణ జరుపుతామని జడ్జి ప్రకటించారు.