హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): తప్పుడు వివరాలతో కోర్టు ధికరణ పిటిషన్ దాఖలుచేసిన వ్యక్తికి హైకోర్టు రూ.5వేలు జరిమానా విధించింది. ఈ మొత్తా న్ని సీఎం రిలీఫ్‌ఫండ్‌కు జమచేయాలని ఆదేశించింది. వయసు రీత్యా కఠినశిక్ష విధించకుండా వదిలిపెడుతున్నట్టు హెచ్చరించింది. సూర్యాపేట జిల్లా చిలుకూరు పోలీస్‌స్టేషన్ లో 1991నుంచి పనిచేస్తున్నా జీతం ఇవ్వడం లేదంటూ షేక్ జానీమియా హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. నాలుగు వారాల్లో వేతనం చెల్లింపు లు చేయాలని గతంలో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
అయినా, జీతం చెల్లించడం లేదంటూ 2018 లో కోర్టుధికరణ పిటిషన్ వేశారు. దీనిపై ఎస్పీ వినతి మేరకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఉత్తర్వులు అమలుకాని పక్షంలో విచారణకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరుకావాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇటీవల ధికరణ పిటిషన్‌ను విచారించారు. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ వాదిస్తూ, పిటిషనర్ షేక్జానీమియా పీఎస్‌లో ఉద్యోగమే చేయలేదని తెలిపారు. బోగస్ సర్టిఫికెట్లను సృష్టించారన్నారు. 2017లో పిటిషనర్ వాస్తవాలు దాచిపెట్టారని చెప్పారు. దీంతో పిటిషనర్‌పై ఆగ్ర హం వ్యక్తం చేసిన హైకోర్టు జరిమానా విధించింది.
ఇరిగేషన్లో వచ్చే ఏడాది భారీగా ఖాళీలు
హైదరాబాద్, నవంబర్29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సాగునీటి పారుదలశాఖలో వచ్చే ఏడాది భారీగా ఇంజినీర్లు విరమణ పొందనున్నారు. జాబితాను ప్రభుత్వం ప్ర కటించింది. ఇద్దరు ఈఎన్సీలు, ఏడుగురు చీఫ్ ఇంజినీర్లు, 15మంది సూ పరింటెండెంట్ ఇంజినీర్లు, 27 మం ది ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 17 మం ది డీఈఈలు ఉండడం గమనార్హం. ఇప్పటికే ఇద్దరు ఈఎన్సీలు, ఏడు సీఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
బెటాలియన్స్ ఆర్ఐలకు త్వరలో బదిలీలు
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 బెటాలియన్లలోని రిజర్వ్ ఇన్స్పెక్టర్ల(ఆర్ఐ) బదిలీలకు రంగం సిద్ధమైంది. మూడేండ్లపాటు ఒకేచోట పనిచేసిన వారిని మరోచోటికి బదిలీ చేసేందుకు టీజీఎస్పీ బెటాలియన్స్ డీజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కొక్కరికి మూడు చోట్ల ఎక్కడైనా పనిచేసేందుకు ఆప్షన్లు ఇచ్చారు. మూడేండ్లు పూర్తికాని ఆర్ఐలు వ్యక్తిగత, వైద్య కారణాలపై బదిలీ కావాలనుకుంటే వారు కూడా ట్రాన్స్‌ఫర్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.