హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ ) : స్పై కెమెరాల విక్రయాలపై కేంద్రానికి మార్గదర్శకాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణకు హైకోర్టు నిరాకరించింది. వాటి విక్రయాలపై కేంద్రానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్టు చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తుది ఉత్తర్వులు జారీచేసింది. స్పై కెమెరాలు దుర్వినియోగమైతే చర్యలు తీసుకునేలా చట్టాలున్నాయని కేంద్రం ప్రతివాదన చేసింది. మొబైల్ కెమెరాలను గుర్తించే అవకాశం ఉందని, స్పై కెమెరాలను రహస్యంగా అమర్చుతున్నారని న్యాయవాది అన్నారు. పిటిషనర్ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు, కేంద్రానికి ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది.