High Court | హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఏఐసీటీఈ,జేఎన్టీయూ ఆమోదించిన ప్రకారంగా ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపునకు అనుమతించాలని గత నెల 9 న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిం ది. అవి అమలు కాలేదని కేఎంఆర్, ఎంఎల్ఆర్, ఎంఎస్ఆర్, సీఎంఆర్ తదితర సంస్థలు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ జరిపింది. ఇంజినీరింగ్ సీట్ల పెంపు ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
మా ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదు?
నిర్మాణ అనుమతుల మంజూరులో హెచ్ఎండీఏతీరును హైకోర్టు ఆక్షేపించింది. అక్షయ డెవలపర్స్ దరఖాస్తును పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని ఆగస్టు 30న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎం దుకు అమలు చేయలేదని హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ను నిలదీసింది.హెచ్ఎండీఏ కమిషనర్‌తోపాటు టౌన్ ప్లానింగ్ విభా గం డైరెక్టర్ విద్యాధర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ.. విచారణను నవంబర్ 15కి వాయిదా వేసింది.
కోర్టు ధిక్కరణపై చర్యలు తప్పవు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ గత మేనేజింగ్ కమిటీ అవకతవకల నివేదికపై చర్యలు చేపట్టాలన్న ఆదేశా లు అమలు కాకపోవడంతో హైకో ర్టు మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.ఇప్పటికే కోర్టు ధిక్కార నోటీసులు ఇచ్చినా ఎందుకు స్పందించలేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ వ్యవహారంలో సహకార శాఖ కమిషనర్ హరిత వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. విచారణ నివేదికను పిటిషనర్ మురళీ ముకుంద్ కి అందజేశామని, కౌంటర్ వేస్తామని ఆమె తరఫున ప్రభుత్వ న్యా యవాది చెప్పారు. దీంతో హైకోర్టు ఆదేశించాక నివేదిక ఇవ్వడం ధికరణే అవుతుందని జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ధికరించినట్టు తేలితే శిక్ష తప్పదని పేర్కొం టూ.. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేశారు.