BRS | హైదరాబాద్, నవంబర్21 (నమస్తే తెలంగాణ): మహబూబాబాద్ ఎమ్మార్వో కార్యాల యం ఎదుట ఈ నెల 25న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ధర్నా నిర్వహించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి షరతులతో కూడిన అనుమతిస్తూ గురువారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. లగచర్లలో పోలీసులు వ్యవహరించిన తీరుపై నిరసనగా ఎమ్మార్వో కార్యాలయం ముందు నిర్వహించ తలపెట్టిన శాంతియుత ధర్నాకు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకుడు వై మురళీధర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ శాంతియుతంగా ధర్నా చేయడానికి అనుమతి కోరినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందంటూ అనుమతి నిరాకరించినట్టు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి శాంతియుతంగా ధర్నాకు అనుమతించాలని అన్నా రు. వెయ్యి మందిలోగా పాల్గొనాలని, నేర చరి త్ర ఉన్నవారు పాల్గొనరాదని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని ఆదేశించారు. షరతులు ఉ ల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకోవచ్చని చెప్పారు.