పెన్షన్ బకాయిలపై హైకోర్టు ఆగ్రహం
ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాల బకాయిల చెల్లింపులో కొనసాగుతున్న జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఎంత మందికి బకాయిలు చెల్లించారో, ఇంకా ఎంతమంది ఉద్యోగులు బకాయిల కోసం ఎదురుచూస్తున్నారో చెప్పాలని, వారికి జారీచేసిన టోకెన్ నంబర్ల వివరాలతోపాటు పూర్తి సమాచారాన్ని 2 వారాల్లోగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది.
- పూర్తి వివరాలు సమర్పించాలని సర్కార్‌కు ఆదేశం
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాల బకాయిల చెల్లింపులో కొనసాగుతున్న జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఎంత మందికి బకాయిలు చెల్లించారో, ఇంకా ఎంతమంది ఉద్యోగులు బకాయిల కోసం ఎదురుచూస్తున్నారో చెప్పాలని, వారికి జారీచేసిన టోకెన్ నంబర్ల వివరాలతోపాటు పూర్తి సమాచారాన్ని 2 వారాల్లోగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. హెడ్ మాస్టర్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, సూల్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఎస్ఐలు, ఏఎస్ఐలు తదితర హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన 764 మందికిపైగా ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై గతంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కోర్టుకు హాజరై.. బకాయిలను త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
కానీ, ఆ హామీ ప్రకారం చెల్లింపులు జరుగలేదని ఆరోపిస్తూ 50 కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎంతమందికి రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించారో, ఇంకా ఎంతమంది ఎదురు చూస్తున్నారో, వారికి జారీచేసిన టోకెన్ల స్థితి ఏమిటో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

