హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ క్యాడర్ పోస్టుల్లో నియమించడంపై హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ వ్యవహారంపై ఈ నెల 10లోగా వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కారును ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎస్ అధికారులు సీవీ ఆనంద్, శిఖాగోయెల్, స్టీఫెన్ రవీంద్రను ఐఏఎస్ క్యాడర్ పోస్టుల్లో నియమించడాన్ని ప్రశ్నిస్తూ సికింద్రాబాద్‌లోని తార్నాకకు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త వడ్ల శ్రీకాంత్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 26న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు (జీవో 1342) ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (క్యాడర్) రూల్స్-1954కి విరుద్ధమని, అవి అఖిల భారత సర్వీసుల మధ్య కార్యాచరణ సమతుల్యతను దెబ్బతీస్తాయని పిటిషన్లో పేరొన్నారు.
దీనిపై జస్టిస్ సూరేపల్లి నందా సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపిస్తూ.. ఐపీఎస్ క్యాడర్ అధికారులను ఐఏఎస్ క్యాడర్ పోస్టుల్లో నియమించడం కేంద్ర చట్టాల నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసును ఈ సందర్భంగా ఉదహరించారు. ఈ కేసులో పోలీస్ అధికారులే విచారణ జరిపి నివేదిక సమర్పించడం, తదుపరి చర్యల కోసం దానిని ఐపీఎస్ అధికారికి (హోంశాఖ ముఖ్య కార్యదర్శికి) మాత్రమే పంపడం తదితర అంశాలను ప్రస్తావించారు. అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ.. ఐఏఎస్ క్యాడర్ పోస్టుల్లో ఐపీఎస్ అధికారులను నియమించడానికి కారణాలేమిటో వివరిస్తూ డిసెంబర్ 10లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీచేశారు.
నిథమ్ డైరెక్టర్ నియామకంపై వివరణ ఇవ్వండి ; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్(నిథమ్) డై రెక్టర్‌గా ప్రొఫెసర్ వీ వెంకటరమణ నియామకంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ మేరకు రెండు ప్రభుత్వాలతోపాటు నిథమ్‌కు, వ్యక్తిగత హోదాలో ప్రొఫెసర్‌కు నోటీసులు జారీ చేసింది. నిథమ్ డైరెక్టర్‌గా వెంకటరమణ ని యామకాన్ని, సంబంధిత జీవో 206ని సవాల్ చేస్తూ సెంటర్ ఫర్ బెటర్ గవర్నెన్స్ హైకోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ నగేశ్ భీమపాక సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. డైరెక్టర్‌ను ని యమించే అధికారం గవర్నింగ్ కౌన్సిల్‌కు మా త్రమే ఉన్నదని పేర్కొన్నారు. పర్యాటక, ఆ తి థ్యరంగాల్లో అనుభవం లేని వెంకటరమణను యువజన సర్వీసుల, పర్యాటక శాఖ నిబంధన లకు విరుద్ధంగా డైరెక్టర్‌గా నియమిస్తూ జారీ చేసి జీవో 206ని రద్దు చేయాలని కోరారు. నిథమ్ బడ్జెట్లో 30% శాతాన్ని (రూ.4-5 లక్షలు) వేతనంగా చెల్లించడం ఆ సంస్థకు భారమవుతుందని తెలిపారు. పూర్తి వివరాలతో కౌం టర్ దా ఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించిన న్యా యమూర్తి విచారణను 22కి వాయిదా వేశారు.