హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో గవర్నర్ కోటా కింద భర్తీచేసే ఎమ్మెల్సీ సీట్ల సంఖ్య తగ్గడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టంలోని సెక్షన్ 23 రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ ఇఫ్తికార్ హుస్సేనీ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను వారంరోజులకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.