సీనియర్లకే 60% నామినేటెడ్ పదవులు
మండల మాజీ అధ్యక్షులు, జిల్లా సీనియర్ నేలతకు 60% నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. గత మండలాల పార్టీ అధ్యక్షులకు, జిల్లా కార్యవర్గాల్లో పనిచేసిన వారికి, అనుబంధ సంఘాల నాయకులకు, నియోజకవర్గ సీనియర్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
- ఎంపికపై గాంధీభవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో సమీక్ష
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మహేశ్‌కుమార్ హాజరు
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తేతెలంగాణ): మండల మాజీ అధ్యక్షులు, జిల్లా సీనియర్ నేలతకు 60% నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. గత మండలాల పార్టీ అధ్యక్షులకు, జిల్లా కార్యవర్గాల్లో పనిచేసిన వారికి, అనుబంధ సంఘాల నాయకులకు, నియోజకవర్గ సీనియర్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం మహేశ్‌కుమార్ గౌడ్‌తో గాంధీభవన్‌లో భేటీ అయ్యారు. పీఏసీఎస్ డైరెక్టర్లు, చైర్మన్లు, పలు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించి విధివిధానాలను రూపొందించారు. ఇన్చార్జి మంత్రి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాల్లో కంటెస్టెడ్ అభ్యర్థులు సీనియర్ నాయకులతో సమావేశమై, సమన్వయంతో ఆశావహుల నివేదిక రూపొందించాలని నిర్ణయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

