యాక్షన్‌తో పాటు తనదైన శైలిలో చక్కటి కామెడీని పండిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు హీరో వరుణ్‌తేజ్. ఆయన నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హారర్, సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ సంస్థలు నిర్మించాయి. నాన్‌స్టాప్ ఎంటర్టైనర్ ఇదని, రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతుందని వరుణ్‌తేజ్ చెప్పారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన విలేకరులతో ముచ్చటించారు.