హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : సింగరేణి కార్మికుల అంగవైకల్యాన్ని నిర్ధారించడంలో మెడికల్ బోర్డు అనుసరించి న తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. 121మందిని ఒకేవిధంగా సాధారణ అంగవైకల్యంగా పేరొనడాన్ని తప్పుపట్టింది. వైకల్యం బారిన పడినందున తమ కుటుంబాలకు ఉద్యోగాలివ్వాలని కోరుతూ చేసిన అభ్యర్థనలను తిరసరించడంతో వారంతా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని విచారించిన సింగిల్ జడ్జి తిరిగి పరీక్షించాలని బోర్డును ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవా ల్ చేస్తూ సింగరేణి దాఖలు చేసిన అప్పీళ్లను ప్రధాన న్యాయమూర్తి అపరేశ్‌కుమార్‌సింగ్, మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం ఇటీవ ల విచారించింది. కాలు తొలగించడం, గుండెపోటు కారణంగా పక్షవాతం, చూపు కోల్పోవడం, మెదడు, నరాల సంబంధిత వ్యాధులు సాధారణ బలహీనతలు కావని తీర్పులో పే రొంది. ఈ పరిధిలోకి వచ్చేవారికి శాశ్వత ప్రయోజనాలు కల్పించాలని ఆదేశించింది.
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో సర్వే నంబర్ 110లో శ్రీబన్సూరి కృష్ణమందిర్కు చెందిన భూమిలో నిర్మించిన ఇండ్లను కూల్చొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు దేవాదాయశాఖకు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. నివాసం ఉన్నందుకు చార్జీలు చెల్లిస్తామని, ఇండ్లలోకి అనుమతించాలని పిటిషనర్లు చేసిన అభ్యర్థనను తిరసరించింది. సైదాబాద్‌లోని రెండెకరాలకు పైగా భూమి శ్రీ బన్సూరి కృష్ణమందిర్కు చెందినదంటూ దేవాదాయశాఖ ట్రిబ్యునల్ గ తంలో తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన సుమారు 11 పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ జరిపారు. ఆలయానికి చెందిన భూమిని ఆక్రమించుకున్నారని, అన్ని న్యాయస్థానాల్లో దేవాదాయశాఖకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని తెలిపా రు. వాదనలను విన్న న్యాయమూర్తి ఇండ్లలోకి పిటిషనర్లను అనుమతించడానికి నిరాకరించా రు. పిటిషన్లపై తేలేదాకా కూల్చొద్దని చెప్పారు.