హైదరాబాద్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ (CJ Aparesh Kumar Singh) తిరుమల శ్రీవేంకటేశ్వ స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న హైకోర్టు సీజే.. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు సీజేకు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సీజే దంపతులను శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.