హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్‌రావు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది.
కేసు దర్యాప్తునకు సహకరించేందుకు పిటిషనర్ సిద్ధంగా ఉన్నారని, ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది కోరారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన జస్టిస్ జే శ్రీనివాసరావు.. తదుపరి విచారణను వారంపాటు వాయిదా వేశారు.