రాజధానిలో గంజాయి బ్యాచ్ హల్చల్
మాకు తెలియకుండా ఇక్కడ ఇల్లు కొంటావా? నీకెంత ధైర్యం? అంటూ అధికార పార్టీ అండదండలున్న ఓ రౌడీమూక, గంజాయి బ్యాచ్ నూతన గృహప్రవేశం చేస్తున్న ఇంటిపై దౌర్జన్యకాండ సాగించిన ఘటన హైదరాబాద్‌లో తీవ్ర భయాందోళన సృష్టించింది.
- గృహప్రవేశం చేస్తుండగా దాడి
- అర్ధరాత్రి 50 మందితో వచ్చి నానా హంగామా
- ఒకరి పరిస్థితి విషమం.. మేడిపల్లిలో దారుణ ఘటన
మేడిపల్లి, జూన్ 28 : మాకు తెలియకుండా ఇక్కడ ఇల్లు కొంటావా? నీకెంత ధైర్యం? అంటూ అధికార పార్టీ అండదండలున్న ఓ రౌడీమూక, గంజాయి బ్యాచ్ నూతన గృహప్రవేశం చేస్తున్న ఇంటిపై దౌర్జన్యకాండ సాగించిన ఘటన హైదరాబాద్‌లో తీవ్ర భయాందోళన సృష్టించింది. తమకు తెలియకుండా గృహప్రవేశం చేయ డం నేరమైనట్టు రౌడీమూక అర్ధరాత్రి ఆ ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించడమే కాకుండా.. కుటుంబ సభ్యులు, బంధువులపై దాడికి పాల్పడ్డారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సం బంధించి పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..
హయత్‌నగర్‌కు చెందిన శ్యామ్‌రావు బోడుప్పల్‌లోని దేవేందర్కాలనీలో ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో తన నూతన ఇంటి గృహప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇంతలో యాకయ్య అనే వ్యక్తి కొంత మందితో అక్కడికి వచ్చి.. మాకు చెప్పకుండా ఇక్కడ ఇల్లు ఎలా కొ న్నావు? ఎవరు ఇప్పించారు? ఇక్కడ ఏం జరిగినా మాకు తెలియాల్సిందే.. ఇక్కడం తా మావాళ్లే చూసుకుంటారు.. ఎవరు ఏంది అని తెలుసుకోవా?.. అన్నను కలిశావా? రాజన్న ఇక్కడంతా చూసుకుంటా డు.. నీవు ఇక్కడ ఇల్లు కొన్నావు.. మాకు వచ్చే కమీషన్లు పోయాయి.. అంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో వారి మధ్య మాటామాట పెరిగింది. యాకయ్య.. సాయి గ్యాంగ్‌కు ఫోన్ చేయగానిమిషాల్లో నే 50 మంది వరకు అక్కడికి కర్రలతో వ చ్చారు. మాకు తెలియకుండా ఇల్లు కొని, ఎదురు మాట్లాడుతున్నావా? అంటూ ఇంటి ముందున్న కారు, బైక్‌ను ధ్వంసం చేశారు. కుటుంబ సభ్యులను కొట్టారు. ఇంట్లోని పూలకుండీలు, తోరణాలను ధ్వంసం చేశారు.
మ ద్యం, గంజాయి మత్తులో వచ్చి సినీ ఫక్కీ లో దాడి చేసి నానా బీభత్సం సృష్టించారు. సీసీ కెమెరాలను పగులగొట్టారు. ఇరుగుపొరుగు వచ్చి ఇదేమి దౌర్జన్యమంటూ ప్రశ్నించగా ఎవడైనా ఎక్కువ చేస్తే అంతు చూస్తామంటూ బెదిరిస్తూ అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో మేడిపల్లి పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. కొంత మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు. కాంగ్రెస్ నాయకుల అండదండలతో ఇక్కడ రౌడీమూక రెచ్చిపోతున్నట్టు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

