Shaymala Devi | హైదరాబాద్ : టాలీవుడ్ హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ పెళ్లి వేడుకలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆమె తారసపడ్డారు. దీంతో కేటీఆర్ ఆమెను ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా శ్యామల దేవి అధికారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ అధికారం మనదే అని కేటీఆర్‌తో ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి అన్నారు. కేటీఆర్ కూడా స్పందిస్తూ శ్యామల దేవికి థ్యాంక్స్ చెప్పారు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. రెండోసారి కూడా అంటే 2018లోనూ బీఆర్ఎస్ ఘన విజయం సాధించి.. మళ్లీ అధికారం చేపట్టింది. ఈ రెండు పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలిపారు కేసీఆర్. ఇక 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అయితే రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి వరకు సంపూర్ణంగా అమలు కాకపోవడమే. హైదరాబాద్‌లో హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూలగొట్టడం. సీఎం స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడడం కూడా రాష్ట్ర ప్రజానీకానికి నచ్చడం లేదు. ఈ క్రమంలోనే ప్రజలందరూ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు.
నెక్స్ట్ అధికారం మనదే
కేటీఆర్‌తో హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి pic.twitter.com/bpmhcp8LTr
— Telugu Scribe (@TeluguScribe) November 13, 2025