హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఎంబీసీ కులాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం చేయాలని సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ తిపిరిశెట్టి మంగళవారం హైదరాబాద్‌లో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ ద్వారా సరైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఒంటెద్దు నరేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగజోగి శ్రీనివాస్ పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఐదు రోజులు గా జ్వరం, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్టు హెల్త్ బులెటిన్‌లో పేరొన్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : సికిల్ సెల్ వంటి మొండి రోగాలను నియంత్రించేలా సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థ పరిశోధనలు ముమ్మరం చేసింది. ప్రత్యేకంగా డెవలప్ చేసిన బయాలజీ టూల్స్ ద్వారా డాక్టర్ చండక్ బృందం సికిల్ సెల్ నియంత్రణపై జాతీయ స్థాయిలో పలు అధ్యయనాల్లో భాగస్వామ్యంతో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సీసీఎంబీ అభివృద్ధి చేసిన మాలిక్యులర్ బయాలజీ టూల్స్ వైద్య రంగంలో జన్యుపరంగా వ్యాధి మూలాలను కట్టడి చేయడంలో ఎంతగానో సాయపడనున్నాయి.