Traffic | హైదరాబాద్ : హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. చిట్యాల వద్ద రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరింది. నాలుగు మోటార్లతో వరద నీటిని అగ్నిమాపక సిబ్బంది తోడేస్తుంది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో చిన్న వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు. విజయవాడ వెళ్లే వాహనాలను పెద్దకాపర్తి, రామన్నపేట మీదుగా మళ్లించారు. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను చిట్యాల, రామన్నపేట, పెద్దకాపర్తి మీదుగా మళ్లించారు.