సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ – విజయవాడ హైవేపై రద్దీ కొనసాగుతోంది. ఏపీ వైపునకు వెళ్తున్న వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోతున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజాతో పాటు పెద్ద కాపర్తి, చిట్యాల వద్ద వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.