Choutuppal | చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్.. 3 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) పట్టణ కేంద్రంలో వాహనాలు బారులు తీరాయి. ప్రజలు పెద్దసంఖ్యలో హైదరాబాద్ నుంచి సొంతూర్లకు పయణమవడంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.
చౌటుప్పల్: సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) పట్టణ కేంద్రంలో వాహనాలు బారులు తీరాయి. ప్రజలు పెద్దసంఖ్యలో హైదరాబాద్ నుంచి సొంతూర్లకు పయణమవడంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దీంతో సంస్థాన్ నారాయణపురం క్రాస్ రోడ్డుని పోలీసులు మూసివేశారు. అటువైపు వెళ్లే వాహనాలు వలిగొండ రోడ్డు వద్ద యూటర్న్ తీసుకొని వెళ్లాల్సి వస్తున్నది.
అంతేకాకుండా చౌటుప్పల్ బస్టాండ్ వద్ద క్రాసింగ్ మార్గాన్ని కూడా కొద్దిసేపు మూసివేశారు. దీంతో స్థానిక వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చుట్టూ తిరగాల్సి వస్తుండటంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
సంక్రాతికి (Sankranti) పట్నవాసులు పల్లె బాటపట్టడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై (ఎన్‌హెచ్ 65) వాహనాలు క్యూకట్టాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. టోల్‌ప్లాజాలో మొత్తం 18 టోల్ బూత్‌లు ఉండగా విజయవాడ మార్గంలోనే 10 బూత్‌లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

