Rains | హైదరాబాద్ : మరో నాలుగు రోజుల్లో రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మెదక్ వరకు రుతుపవనాలు విస్తరించాయి. ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ కారణంగా రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మరో నాలుగు రోజులు రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.