Rains | హైదాబాద్ : తెలంగాణలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈ రోజు ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయి. నాసిక్, నిజామాబాద్, సుకుమా, విజయనగరం, ఇస్లాంపూర్ వరకు విస్తరించనున్నాయి రుతుపవనాలు.
నైరుతి రుతుపవనాల విస్తరణ నేపథ్యంలో తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) June 10, 2024