Heavy Rains | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, అసవరమైతేనే బయటకు వెళ్లాలని సూచించింది. ఇక దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
ఇక మరో 2-3 గంటల్లో ఆదిలాబాద్, జగిత్యాల, జనగాం, గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నెల 19న సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో, ఈ నెల 20న రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో, 21న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో, 22న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.