హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గురువారం నుంచి ఈ నెల 9 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
గురువారం వాయవ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం పేరొన్నది. ఏపీలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మత్య్సకారులు వేటకు వేళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.