హైదరాబాద్: నైరుతి రుతుపవనాల (Monsoon) ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతోపాటు వాయుగుండం ప్రభావం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని తెలిపింది. రుతుపవనాల రాకతో జూన్ రెండోవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనావేసింది. రుతుపవనాలు విస్తరిస్తుండటంతో ఏపీ, తెలంగాణలో మరో వారం రోజులపాటు వర్షాలు ఇలాగే కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.