TG Weather | తెలంగాణలో రాగల నాలుగురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటున సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపునకు వంగి ఉందని.. దాని ప్రభావంతో రాబోయే 24గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర ఒడిశా తీర ప్రాంతం, వాయువ్య బంగాళాఖాతంలో సగటున సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల విస్తరించి ఉందని.. మయన్మార్ తీరం నుంచి ఉత్తర ఒడిశా వరకు ఉన్న ద్రోణితో కలిసిపోయిందని వాతావరణశాఖ వివరించింది.
ఈ క్రమంలో తెలంగాణలో సోమవారం భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. మంగళవారం కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. జనగాం, ఆదిలాబాద్, కామారెడ్డి, జనగాం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
బుధవారం కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది. ఈ నెల 4న రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, కామారెడ్డి, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ములుగు జిల్లా ఏటూరునాగారంలో 11.7, కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 15, కొత్తగూడెంలో 19.2, నాగుపల్లెలో 12, మహమూబాబాద్ జిల్లా భూపతిపేటలో 11.9 సెంటీమీటర్ల భారీ వర్షపాతం రికార్డయ్యిందని టీజీ డీపీఎస్ వివరించింది.
Read Also :
Gold Rate Hike | ఆల్‌టైమ్ గరిష్ఠానికి బంగారం, వెండి ధరలు..! తులం ఏకంగా రూ.1.5లక్షలు..!
ICC Women’s World Cup | వుమెన్స్ వరల్డ్ కప్-2025 విజేతకు భారీగా ప్రైజ్‌మని ప్రకటించిన ఐసీసీ..!